*స్నేహితులు* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(నాలుగవభాగము):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 13)
పురుగులాగ ఒడలంతా పాకినాడు
శత్రువు గమనించేలోగ దుమికినాడు
అదిచూసిన శత్రువొకడు బక్కోడినిపట్టెను
గట్టిగ చేయి విరిచిపెట్టెను!
14)
పెద్దోడు వారిని శిక్షించే
తన మిత్రుని రక్షించే
వారంతా భయపడి వెళ్ళిపోయారు
అప్పుడే వచ్చిన మానినిచూశారు!
15)
అయ్యానన్ను దయతో రక్షించారు
దుర్జయులను చిత్తుగా ఓడించారు
ఇప్పటి నుండి మీకునేను
తప్పక దాసిని అవుతాను!
16)
అలా అనగానే ఆమెను
మహాకాయుడు రయమున చేపట్టెను
మువ్వురును మరికొంత దవ్వుకేగిరి
దుర్గమ అరణ్యము చేరిరి!
(సశేషం)

కామెంట్‌లు