మర్రిచెట్టు నీడ ...!!:------శీరంశెట్టి కాంతారావు రచయిత పాల్వంచ .

 అవి మాఊరి టూరింగ్ టాకీస్ లో మంగమ్మ శపథం సినిమా మహా రంజుగా నడుస్తున్న రోజులు
ఓరోజు పొద్దున్నే మామిత్ర బృందమంతా మల్లయ్య మంగలిషాపులో కొలువు దీరి
 ఆ సినిమా ముచ్చట్లే చెప్పు
కుంటున్నాం
ఇంతలో...
చెట్టుమీద నుండి రాలిపడిన మేడిపండులా 
లింగన్న కూడా ఊడిపడ్డాడు
వచ్చీరావడంతోనే తల మంగలాయన కప్పగించి
కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్న జాంబిరెడ్డిని చూడ్డంతోనే..
రివ్వున సాగె రెపరెపలాడె
అంటూ పాటందుకున్నాడు
ఆపాట వినడంతోనే చప్పున కుర్చీలో నుంచి కిందకి దూకిన జాంబి
నీయమ్మ గొల్లోడా! ఏంద్రా నువ్వుపాడేదంటూ లింగన్న మీది కురికి గల్లాపట్టాడు
జరుగుతున్న దేంటో అర్థంకాని మేమంతా అడ్డమెళ్ళి విడిపించాం
వెంటనే బైటికి నడుస్తున్న జాంబి వెనుక పడ్డ మంగలి మల్లయ్య అయ్యో తలపని సగంల వుండంగనే పోతవేందంటూ అడిగాడు 
నాకు తలపనొద్దేమొద్దు
ఆ లింగడుగాడు వున్నంతసేపు నీ కొట్టుదిక్కే రానంటూ సరసరా వెళ్ళిపోయాడు 
ఈ కిలాడీ లింగడే వాణ్ణేదో కెలికాడని గ్రహించిన మేమంతా విషయమేంటో చెప్పమని చుట్టూ మూగాం
నేనేదో సిన్మాపాట పాడుకుంటే ఇక్కడున్న మీకందరికీ లేని ఉలుకు వానికెందుకొచ్చింది?
తలపనిగూడ కాకుంటనే మద్యల ఎందుకు పోయిండు?ఎదురు ప్రశ్నలేశాడు లింగడు
దాంతో వాళ్ళిద్దరి మధ్యా ఖచ్చితంగా ఏదో జరిగిందనుకున్నమేము
మరింత వత్తిడి చేయడంతో
లింగడు నోరిప్పాడు
రోజు మాదిరిగానే ఆరోజూ పిల్లమండ కోసమని తువ్వచేలదిక్కున్న కందిచేలల్లో జొరబడి సాళ్ళల్లో వెతికి వెతికి గొడ్డుబోతు చెట్లను కొట్టి తను లేపగలిగినంత మోపుకట్టి పెట్టి  ఎవరన్నా రైతులొస్తున్నారేమో చూద్దామని పక్కనున్న మర్రి మీది  కెక్కేసరికి  కంది చాళ్ళల్లో యానాదోళ్ళ పోరి చెయ్యి పట్టుకుని యన్టీవోడి మాదిరిగా నడుము తిప్పు కుంటూ నేరుగా మర్రికిందికే వస్తున్నాడు జాంబిగాడు
దాంతో లింగడు కొమ్మల్లో నక్కి
కిక్కురు మనకుండా కూర్చున్నాడు
చెట్టుకిందికొచ్చిన వెంటనే వాళ్ళిద్దరూ వివస్త్రులయ్యారు
యానాది పిల్లను దగ్గరికి తీసుకున్న జాంబిగాడు చెవిలో ఏదో ఊదాడు
అంతే అది సిగ్గులమొగ్గైపోతూ సాళ్ళ మధ్యన వెనుదిరిగి తూర్పు ముఖంగా పోతుంటే జాంబిగాడు పడమరముఖంగా వెళ్ళసాగాడు
కొమ్మల్లో నుండి ఇదంతా గమనిస్తున్న లింగడు ఇదేందీకత కొత్తగుంది అనుకుంట జుట్టుపీక్కోసాగాడు
కొంతదూరం వెళ్ళినవాళ్ళు హఠాత్తుగా వెనుదిరిగి కొంగరెక్కల మాదిరి చేతులిప్పి
'రివ్వునసాగే రెపరెపలాడే' పాటపాడుతూ పరుగెత్తుతూ చెట్టుకిందికికొచ్చి గతుక్కున్న కౌగిలించుకున్నారు.   
మళ్ళీ మళ్ళీ పదినిమిషాల పాటు అదేపాట అదేపాటు
చెట్టుమీది లింగడికి తిక్కరేగి అరే జాంబిగా! ఇంకెంతసేపు ఎగుర్తర్రా అన్నాడు గట్టిగా దాంతో పిడుగు పడ్డట్టు ఉలిక్కిపడిన వాళ్ళిద్దరూ కందిచాళ్ళకు అడ్డంబడి దూరంగా పరుగులు తీశారు
ఉడతపిల్లలా కిందికి దూకిన లింగడు మోపెత్తుకొని అదేపాట పాడుతూ డొంకలోకి చేరి తెట్టెగోడమీద మోపుదించి నిలబడ్డాడు
ఐదు నిమిషాల తరువాత కందిమెల్లె అందుకున్న యానాది పిల్ల జాంబిగాణ్ణి చేనంతా ఉరికిచ్చి జబురుకుంటున్న చప్పుడు చెవులారా వింటూ ఇంటిదారి పట్టాడు 
ఆమాటలు విన్న మాపొట్టలు పగిలిపోయాయి