సాయమంటే ధనము మాత్రమే కాదులే
అందరికీ ఇది అంతగా సాధ్యమయ్యేది కాదులే !
అక్కరకు వచ్చినపుడు మాటసాయమే చాలులే
వినుము కె.ఎల్వి.మాట నిజము సుమ్ము....!!
----------------------------------------------------------------
సహృదయముతో సాయమందించు జనులు
స్వీయ పొగడ్తలతో చెలరేగిపోరాదు ఎప్పుడు
మంది తెలుసుకొని అందించు ఆశీస్సులే గొప్ప !
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము...!!
--------------------------------------------------------------
సంపాదనలో దశమ భాగము దేవుడి సొత్తని
చెప్పుచున్నది కదా మన పరిశుద్ధగ్రంధము ,
మానవ సేవలో గుప్పిలి విప్పుము సోదరా....!
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
--------------------------------------------------------------
సహాయమనిన రూపమ్ములో పలురకములు లే ...
పేద విద్యార్దికి పుస్తకాలసాయము మంచిదే లే....
లేనివాడికి వస్త్ర దానమూ మహాప్రసాదమే లే....
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము.....!!
--------------------------------------------------------------
అనాధశరణాలయాలలో అన్నదానము మేలు !
ఆకలిగొన్నవారికి కడుపునింపుట యే పుణ్యము
ఆలోచించి చూడగా ఇదియే గొప్పకార్యము కదా
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము....!!
----------------------------------------------------------------
కష్టపడగల చేవ కలిగియుండి కూడా కొందరు ,
బిక్షమెత్తు కార్యమునకు దిగజారిపోదురు ఎందుకో!
స్వయంకృషితో కడుపునింపుకొన్నతృప్తి గొప్పది లే
వినుము కె. ఎల్వీ.మాట నిజము సు మ్ము....!!
---------------------------------------------------------------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి