*గుణింత గేయాలు**ఊ-ూ- కొమ్ము దీర్ఘం పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 ఇంటి ముందు పూలు చాలా విరబూసినవి
మందార పూవులు అందాలు చిందినవి
గులాబీలు చూడ ఘుమఘుమ లాడినవి
రంగు రంగుల కనకాంబరాలు
రా రా యని పిలిచినవి
పూసిన పూవులను పూజ చూసింది
బంతి పూవులను చూసి చాలా మురిసింది
పూలు కూడా తమలాంటి బాలలని తలచింది
సూది దారం తీసి మూలకూ విసిరింది.

కామెంట్‌లు