మాన్యశ్రీ లోకమాన్య బాలగంగాధరతిలక్*:-*బెజుగాం శ్రీజ*

 *పద్యం*
*సీసమాలిక*
బాలగంగాధరు బాల్యమునుండియు
చురుకైన విద్యార్థి చూపరులకు
గణితశాస్త్రంలోన ఘనముగతిలకుడు
ఆసక్తికనబర్చె యాశదీర
పాశ్చాత్యవిద్యను పారదోలించియు
మేలునుకోరెను మితముతోడ
రౌద్రముజూపిస్వరాజ్యమునాజన్మ
హక్కనిసాధించె చక్కగాను
స్వాతంత్ర భారతీ జగతియె మెచ్చెలా
గొప్పతనముచాటె మెప్పుబొంద
అంటరానితనాన్ని నంగీకరించక
దేవున్ని నిలదీసె తేజముగను
దేశపుప్రజలనం దేకతాటిగజేసి
ఐక్యతగనిలిపి హాయిపెంచె
*ఆటవెలది*
లోకమాన్యబిరుదు లోకమే మెచ్చెలా
నందుకొనెతిలకుడు నందముగను
దేశచరితలోన దేదీప్యమానమై
పుడమిపైనవెలిగె భువిని మెచ్చ

కామెంట్‌లు