జీవనరాగం ....!! (వచనపద్యం): -డా.కె.ఎల్.వి.ప్రసాద్హన్మకొండ.

 డబ్బులున్నవారమని తాముబహుగొప్పవారమని ,
విర్రవీగు జనులు ఖర్చుచేయుదురు కళ్లు---- మూసుకుని ,
అదుపుతప్పినఖర్చు కొండనైనా కరిగించు కదా !
వినుము కె.ఎల్వీ. మాట నిజము  సుమ్ము....!!
--------------------------------------------------------------
పండుగలు- పబ్బాలు ,పెళ్ళిళ్ళు -పుట్టినరోజులు
బఫేల మోజులో లెక్కలేనన్ని రకాల  వంటకాల జోరు
ఆశగాతిన్నది తక్కువ పారబోయునదిబహు ఎక్కువ
వినుము కె.ఎల్వీ.మాట నిజము  సుమ్ము....!!
------------------------------------------------------------------- 
విందులకు పోయి పసందైన వంటకాలుచూసి 
జిహ్వచాపల్యముతో అన్నిటితో పొట్ట బాగానింపి 
ఆపైన అజీర్ణము బాధతో తలక్రిందులగుట మేలా ?
వినుము  కెఎల్వీ .మాట నిజము  సుమ్ము ....!!
------------------------------------------------------------------
భోజనము ఉచితమని తొందరపడి బొజ్జనింపరాదు
మితృడి ప్రేమ విందులో లెక్కలేనంత లిక్కరు దొరకు 
పొట్టబాధ ముందు తాత్కాలిక విందు ఏపాటిది ?
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము   సుమ్ము....!!
-------------------------------------------------------------------
నిజామును విమర్శించి జైలుగోడలమధ్య దాశరథి 
పొట్టివాడైనా గట్టిగా పిడికిలిబిగించి సింహమై గర్జించి 
కవితనే విల్లంబులుగా ఎక్కుపెట్టిన ఈకవికేమి దక్కె 
వినుము   కె.ఎల్వీ.మాట నిజము  సుమ్ము....!!
--------------------------------------------------------------
బొగ్గుముక్కనే కలంగా ,జైలుగోడనే కాగితము చేసి 
నిజామును దూషించు ఉద్రేకపూరిత కవితలు వ్రాసి 
కవుకుదెబ్బలుతిన్న కవి కృష్ణమాచార్యునికేమిదక్కె 
వినుము కె.ఎల్వీ. మాట  నిజము  సుమ్ము....!!
-----------------------------------------------------------------
మొదటిపాటతోనే ఘనముగా మెచ్చుకోలు దక్కి 
ఇద్దరుమిత్రులు -వాగ్దానం సినిమాలతో సినీరంగాన, 
చక్కని సినిమా పాటల కవిగా దాశరధి ప్రసిద్దికెక్కెగా
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము....!!
-----------------------------------------------------------------
భక్తి పాటలకు దాశరధి కలం దేవుడిచ్చిన వరం 
ప్రేమపాటలకు కూడా ఆయన పెట్టింది పేరు లే ...!
అవార్డులకాలానికి మూగబోయే ఆయన కలం 
వినుము కె.ఎల్వీ.మాట నిజము  సుమ్ము.....!!
--------------------------------------------------------------
ఇందిరమ్మ పాలనలో అత్యవసర పరిస్తితిని 
సమర్ధించి దాశరథి అభాసుపాలయ్యే కొందరిలో ...
అయిననేమి అతడు ఆస్థానకవి స్థానమలంకరించె !
వినుము  కె .ఎల్వీ .మాట   నిజము సుమ్ము ...!!
----------------------------------------‐-----------------------
' గాలిబ్ గీతాలు 'తెలుగున కనువదించి దాశరథి 
తెలుగుపాఠకలోకాన ఘనుడయ్యె కృష్ణమాచార్య !
లలితగీతాలకు పెట్టింది పేరు కదా!మన మహాకవి ,
వినుము కె.ఎల్వీ.మాట నిజము  సుమ్ము....!!
---------------------------------------------------------------