బుల్లెట్ పాయింట్స్ (తొలి ప్రయత్నం ):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

కవనం ఓసృజన 
కాపీ సొంతభజన !

సమాజాన్ని  గమనించు 
సౌశీల్యతనే ఆదరించు !

దైవాన్ని  మరిచినవాళ్ళు 
దేశాన్నే అమ్మేటోళ్లు !

పిచ్చిగా ప్రేమించినవారు 
చివరికి పిచ్చివాళ్ళవుతారు !

చెప్పుడు మాటవినకు 
చెడుతావు తుదకు!

వస్తువుకు  గిట్టుబాటుధరా 
దళారీలతో కలేరా !

ఆకాశం మబ్బేసింది 
రైతుకానందం చుట్టేసింది !

చిక్కులు చింతలదారి 
తొలగించుకుంటే  రహదారి !

ప్రయత్నం పట్టుదలగా 
సాఫల్యం సులువుగా !

కవితలు పంపుతుందామే 
 "హామీ సందేహమే!