షాడోలు (క్రీనీడలు) బజ్జీ మిర్చిలు :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.

మిర్చి బజ్జీలు 
రుచికి ఉజ్జీలు 
జోరు వర్షాలు 
కాలక్షేపం దినుసులుమా !

వేడి వేడిగా 
లాగించేగా 
వద్దు అనవుగా 
మిర్చి బజ్జీలు సూపరుమా!

సెనగ పిండితో 
ఉల్లి పాయతో 
వామును  పొడితో 
ఘుమ ఘుమలాడే రుచులు ఉమా!

చుట్టాలొచ్చిన 
అర్జెంటయ్యిన 
చప్పున వండిన 
వంటకమిదేను కదా ఉమా!

 చట్ని పుదీనా 
కొత్తిమీరనా 
నిమ్మకాయనా 
అదిరే  లొట్టలు వేయునుమా!

సంతలో బండి 
వేగుతూ ఉండి 
హాట్ కేకులండి 
అమ్ముడు పోయే దినుసు ఉమా!

బ్రతుకు తెరువుగా 
టిఫిను బండిగా 
ఉభయ వేళగా 
పైసలు దొరికే పనిగ ఉమా!