*గంగావతరణము* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(మూడవభాగము):- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 9)
ఆపదలో ఆదుకో ఈశ్వరా
గంగను నిలుపుకో మహేశ్వరా
అడిగినంతనె వరమిచ్చు వాడా
అని భగీరథుడు వేడా!
10)
భగీరథా నిను కరుణిస్తాను
గంగను నేను బంధిస్తాను
నాశిరమున శిరోజాలలో ఉంచేస్తా
నీకోసం చిన్నభాగం వదిలేస్తా!
11)
అప్పుడు వచ్చింది గంగ
శివుని శిరోజాలలో ఒదగంగ
భగీరథుని కోరిక మేరకు
చిన్నభాగం బయటపడింది నేలకు!
12)
ముందుగా హిమశైల శిఖరాన
తనపాదము ఉంచింది సంతసాన
అటుపైన కిందికి ఉరికింది
భువినున్న ప్రకృతికి పులకించింది!
(సశేషము)

కామెంట్‌లు