మా ఎద్దులు -బాల గేయం :--. ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
రామా లక్ష్మణులు మా ఎడ్లు 
రంగైన కొమ్ములు మా ఎడ్లు 

సినుకూ పూలల్లోన
సెలక సేను దున్నీ 
సిరులు పండించేను 
మా ఎడ్లు! 

తలూపి పిలుస్తాయి 
మౌనంగా నడుస్తాయి 
కాడెత్తి దున్ను తాయి 
మా ఎడ్లు !

బండి కడితే పరిగెత్తి 
. మొండిగాను బరు వెత్తి 
కండనిండు మమతలెత్తి 
మా ఎడ్లు !

మూగ జీవులoడి 
త్యాగం నైజమండి 
యోగ నందీశ్వరులు 
మా ఎడ్లు!