పల్లె-పట్టణ వాసుల సంస్కృతి,మాతృప్రేమ(తేటగీతి పద్యాలు)డా‌.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 పల్లె-పట్టణ వాసుల సంస్కృతి:

పలక రించెడి యాప్తులు పల్లె వారు
కలిసి ఉండెడి గుణమును‌ కాంచ గలము
నగర వాసులు యెవరిని‌ నమ్మ లేరు
పక్క ఇంటిని చూడని‌ పట్న పోళ్ళు
         :మాతృప్రేమ:
జనని చూపును వాత్సల్య జాడ తానై
తల్లి ఆరాట పోరాట తపన గనిన
దీప కాంతిగా నిలుచును దీప్తి నిచ్చి
సంతు బాగును కోరెడి సహన శీలి