పంద్రా అగస్ట్:-కళావతి కందగట్ల హైదరాబాద్

 రారండి రారండి
బాలల్లారా రారండి
రారండోయ్ రారండి
పిల్లల్లారా రారండి
పంద్రాగస్టు వచ్చింది
జెండా వందనం చేయండి...
//రారండీ //
చ...
పెందలకడనే లేవండి 
బడిలో అందరూ చేరండి
జట్లు జట్లుగా నిలవండి
భరతమాతను కొలవండి
దేశ నాయకులను  తలవండి
వందనమే చేయండి 
// రారండీ //
 స్వతంత్ర దేశం మనదంటూ 
 ఎలుగెత్తి మీరు చాటండి
 భారత మాతకు జై అంటూ
 బాలలందరూ గొంతు కలపండి
 /రారండీ //
ఎగురవేసిన త్రివర్ణ పతాకం
రెపరెపలను తిలకించండి
భరత మాత ముద్దు బిడ్డలమని
సగర్వంగా తల ఎత్తండి
తల ఎత్తుకుని తిరగండి
//రారండీ //