గమనం ...!!:-----డా.కె.ఎల్.వి.ప్రసాద్, హన్మకొండ .

పోయిన సహచరుడు
తిరిగివస్తాడని కాదు !
తన చరమాంకంలో
కన్నబిడ్డలు ప్రేమగా
చూడరనికాదు ....!

గతాన్ని గుర్తుచేసుకుంటూ
బ్రతుకంతా సేదదీర్చిన
చెట్టునీడకింద .....
బ్రతుకు లో ఎదురైన
మిట్టపల్లాలను
నెమరువేసుకుంటున్నది ,
తనకాయకష్టాన్ని
నమ్ముకుని బ్రతుకుతున్న,
ఆ ...అవ్వ ...
గతాన్ని -భవిష్యత్తుకు ముడిపెట్టి
సుదీర్గ ఆలోచనల్లో ...
తనకుతాను -
తనకళ్లముందు ...
దర్షింప జేసుకుంటున్నది ...!
బ్రతుకు గమనాన్ని ...
కనులారా ..
వీక్షిస్తున్నది.....!!