జల నక్షత్రాలు :-, కె ప్రతాప్ రెడ్డి. ((ప్రతాప్ కౌటిళ్యా))
 జల వృక్షాలు నీటి మేఘాలు
 జల నక్షత్రాలు సముద్ర చేపలు
 భూమిపై మణులు  మహిళలు
 ఒక వెలుగు వెలిగడానికి  
 ఒక మొలక మొలవడానికి ఇవి చాలు !?

 కంటికి వెలుగు కన్నీటికి కారణం 
 ఒక రెప్ప పాటు విరామం మాత్రమే
 ప్రయాణమే ఆనందం  అందం 
 గమ్యం రహస్యమేమీ కాదు


ప్రేలిన అగ్నిపర్వతం ఇంటి పై వాలిన పక్షి
 ఒక్కొక్కప్పుడు కాళ్లతో కాదు 
  రెక్కల తోనే రక్షింపబడ్తుందీ
 ఉప్పొంగిన సముద్రంలో 
సుడిగుండం గుండా ప్రయాణించాల్సిందీ 
పడవ కాదు పక్షి మాత్రమే 


  బంగారం వజ్రాలు దాచిపెట్టిన భూమి నీ 
అవలీలగా ఆక్రమించే ది సముద్రం మాత్రమే
 సత్యం తెలిసి సూర్యుడే మీ   తనలో దాచుకోలేదు
 అంతా దహించి వేస్తున్నాడు!?
 దళాలు మనుషులకే కాదు 
పత్రాలకు పనికి రావడం లేదు
 రాలిపోతున్నాయి!?

 కాకులు సైతం రాకపోకలు  మానుకున్నావీ
 ఏ ఇంటి గోడ మీద వాలడం లేదు 
 ఏనుగుల నుంచి ఆహ్వానం అందిన
  ఏ మొహం పెట్టుకొని విందు వినోదాలకు
 కుందేళ్ళు అర్థరాత్రి హాజరవుతావీ
 వెంట్రుకలే లక్షల్లో మొలుస్తాయి వేలల్లో 
రాలిపోతాయి ఒక్క జంతువు ల్లోనే
 మనుషులకు తిక్క కుదిరింది బట్టతల లు
 బట్టలు వేసుకుంటున్నారు!?


  తాబేల్లు నత్తలు భవిష్యత్తు
 ఒక్క మనిషి మాత్రమే వర్తమానం
 భాగ్యం అంటే భవిష్యత్తు కాదు వర్తమానం మాత్రమే
 చూసిన ప్రతి చూపుల్ని చిత్రిస్తూ పోతే చివరి చూపే మిగులుతుంది 
 ఆదాయాలు వేదాలు ఏం కాదు ప్రతి యుగంలో వల్లేవేయడానికి
అలాఅయితే అందరి ఇళ్లల్లో ఆయుధాలే అమ్ముడవుతాయి!? 

 మనిషి ఇల్లు కట్టుకున్నాడు మెట్లు మర్చిపోయినట్లున్నాడు
 తన ఇంటి పైకి తానే చేరుకోలేక పోతున్నాడు తెల్లవారింది 
అని తెలిపేది పక్షులు కాదు తెరుచుకున్న తలుపులు కాదు తెరుచుకున్న కళ్ళు మాత్రమే!? 


 నేను నువ్వు ప్రేమిస్తూ పోతే ఈ ప్రపంచం సరిపోదు
 జీవిత కాలం మిగలదు
 ఆనకట్ట తోనే  జలపాతాన్ని నదుల్ని దారి మళ్ళించి 
వేరుపరచగలుగుతాం!?
 అరుదుగా ఆడజన్మ జన్మించింది మనకు తోడుగా
 జల నక్షత్రాల్లా!?

 Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273