విలువలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 

విత్తు నేల ఒడిలో నుంచి 
శిరస్సు పైకెత్తుకుని ఠీవిగా నిలబడుతుంది.
లేత చిగుళ్ళతో కొమ్మకొమ్మకు 
చోటిచ్చి విస్తరించి ఉంటుంది.
ఆకులన్నీ విషవాయువులను
 పీల్చుకుని ప్రాణవాయువు అందిస్తాయి.
మొగ్గలు పూలై వికసించి పరిమళాలు వెదజల్లుతాయి.
కాయలు పండ్లు ఆకలి తీర్చి కడుపు నింపుతాయి.
చెట్టు నీడ నిచ్చి గూడు గా మారుతుంది.
మనిషి పోయాక అంతిమ సంస్కారానికి 
కట్టె తో పాటు కట్టెలా కాలిపోతుంది.
చెట్ల కొమ్మలపై పక్షుల గూటికి నిలయమై
 కిలకిల రావాలతో ప్రకృతికి అందాన్నిస్తుంది.
నదీజలాలు దాహార్తి తీరుస్తూ పంట పొలాలకు 
జీవ ధారలై అన్నదాతకు బంగారం పండిస్తుంది.
సూర్య కిరణాలు వెలుగులు పంచి 
చీకట్లను పారద్రోలి మేఘమై వర్షం కురిపిస్తుంది.
సెలయేళ్ల కు నదులకు జీవ కళలై 
సముద్రంలో కలుపు కొంటుంది.
అక్షరం సైతం మెదళ్లను కదిలించి 
విజ్ఞాన అజ్ఞానపు పంచులు తాకి మేధావిని చేస్తుంది.
మానవీయ విలువల్ని కాపాడుతూ 
సంస్కృతి సంప్రదాయాలను నేర్పుతుంది.
మనిషి మాత్రం నాగరికత ముసుగులో 
నైతిక విలువలకు తిలోదకాలిచ్చి 
ప్రపంచాన్ని అరచేతిలో సృష్టించుకుని 
కంప్యూటర్ యుగంలో మానిటర్ లా మారి 
అనాగరికత అమాయక తో విలువల్ని 
మరచి సంపాదన వేటలో తనవారిని మరచిపోయి
 పరాయి వాడిగా బ్రతుకుతూ సత్యం ధర్మం 
నీతిని వదిలి వంచన వైపు అడుగులు వేస్తున్నాడు.
మానవ సంబంధాలు పెన వేసుకుంటేనే 
నవజీవన నిర్మాణానికి పునాదులై 
మానవీయ విలువలు పెరుగుతాయి.
త్యాగ భావనకు తరువులే గురువులై విలువలు కాపాడుతాయి.