*స్నేహితులు* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(ఏడవభాగము):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 25)
చాలుచాలు కాలు కన్నుపోయె
చేయి నడుము విరిగిపోయె
ప్రతిపోరున లబ్ది నీది
నష్టము అంతా నాది!
26)
నీవంటి వానితో స్నేహమువద్దు
మంచి నేస్తాలతో స్నేహముముద్దు
ధీరులై శూరులై ఉండాలి
నేస్తాలకు ఉపకారులే కావాలి!
27)
తెగదెంపు నేటినుండి నీకునాకు
అధికుడితో అల్పుడిని పొత్తులేదునాకు
వియ్యమైన కయ్యమైన నెయ్యమైనగాని
సమవుజ్జీ కూడకున్న ఫలితమేమిమేదిని!
28)
మంచి నేస్తాలను ఎన్నుకోవాలి
మన స్థితిని చూసుకోవాలి
ఉంటే ఎక్కువ అంతరము
గ్రక్కున విడవాలి స్నేహము!!
(సమాప్తం)a