పూదోట.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 తెల్ల తెల్ల వారంగా తూర్పువైపున 
కళ కళ విరిసెను పుష్పాలు
కిలకిలా నవ్వుతూ చిన్న పాపలు తోటలోనికి వచ్చారు.
అప్పుడే విరిసిన గులాబీ వైపు 
పాపలు ఆశగా చూశారు.
అందం ఆనందం అందించాలని
 వినయంగా పలికింది రోజా పువ్వు.
నమ్రతగా ఒదిగి ఉండాలంటూ 
నందివర్ధనం చెప్పింది నవ్వులు రువ్వుతూ.
సంతోషాన్నిపంచాలంటూ
చంద్రకాంతలు చెప్పాయి.
అమ్మానాన్నల సన్నిధి వెలగల
పెన్నిధి అని గన్నేరు చెప్పింది.
మంచితనం మానవత్వం పరిమళించని 
మల్లెల నవ్వుతూ సెలవు ఇచ్చాయి.
కాలం విలువ తెలుసుకోమని సూర్యకాంతం తెలిపింది.
పెద్దల పట్ల ఒదిగి ఉండాలని అని తలలూపాయి.
దేవుని పట్ల భక్తి ఉండాలని బంతిపువ్వులు పలికాయి
జీవితాన్ని ఆనందించమని సన్నజాజులు సరసమాడాయి. 
మహా వికాసం కలిగి ఉండాలని విరిసిన కలువలు పలికాయి
చివరికి చిన్నారుల అంతా ఆనందంతో గంతులు వేస్తూ 
కేరింతలు కొడుతూ హాయిగా తీయగా పాటలు పాడుతూ 
పూలకు చేతులూపారు. మళ్లీ మళ్లీ వస్తానంటూ 
మాటలు ఎన్నో చెప్పి హామీ ఇచ్చారు
పువ్వుల చెప్పినా మంచి మాటలు నచ్చాయంటూ 
మనం మనం నేస్తాలు అన్నారు.