జీవనరాగం ...!! (ఆన్షీలు):-డా.కె.ఎల్.వి.ప్రసాద్హన్మకొండ .

  స్వంత గొప్పలు చెప్పిఎవరినీ  మెప్పించ పనిలేదు ,
పప్పుకూడుకొసమని అప్పుచేయనవసరం లేదు !
'పిండికొద్దీ రొట్టె ' సూత్రము పాటించుబాయి...
వినుము  కె .ఎల్వీమాట ,నిజము సుమ్ము ....!!
---------------------------------------------------------------------
'అప్పులకు' మనిషి ఆమడదూరముండాలి ,
సంపాదనలో కొంతయినా దాచుకోవాలి ....!
రేపటి అవసరాలకు కొంతయినా మిగుల్చుకో ,
వినుము కె.ఎల్వీ.మాట, నిజము సుమ్ము....!!
--------------------------------------------------------------------
కనీస అవసరాలకు మొదటి ప్రాధాన్యత నిమ్ము,
ఆడంబరాలకు ఆ పైన చోటుకే నీ యొక్కఓటు!
సుఖ జీవితానికి ఇది పెద్ద కనికట్టు సొదరా ....
వినుము కె.ఎల్వీ.మాట, నిజము సుమ్ము .....!!
---------------------------------------------------------------------
'వడ్డీ' ల  జోలికి అసలుపోరాదు ఎన్నటికీ ....
మాడ్చి మసిజేయు ఇది ఎంతటిమనిషినైనా !
ఖర్చులన్నీ ఓమారు విశ్లేషించు చూడుమా ...
వినుము కె.ఎల్వీ .మాట ,నిజము సుమ్ము ....!!
----------------------------------------------------------------------
ఉచితమన్న చప్పున మనసు ఉరకలేయరాదు ,
పవిత్రమైన  ఓటుకు -నోటు తో అమ్ముడుపోరాదు !
క్షణికమైన అసందర్భ సుఖాలకు బానిసకారాదు ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము......!!
--------------------------------------------------------------------
 
 వర్షమొచ్చి వరదలుప్రవహించు ఇండ్లలోనికి
నీరుబయటకు పోవు మార్గాలు కబ్జాల మాయ 
అసలు తప్పెవరిదో మరి కనిపెట్టు ము సొదరా !
వినుము   కె.ఎల్వీ. మాట నిజము  సుమ్ము ...!!
----------------------------------------------------------
అకాలవర్షాలతోముంపుకు గురి అయ్యే కాలనీలు
పాలకుల తాత్కాలిక కంటి తుడుపుతో సేదదీరు
కాంట్రాక్టర్ల పోషణకు ప్రతియేడు ఇదే ఏడుపు కదా !
వినుము  కె.ఎల్వీ. మాట  నిజము  సుమ్ము....!!
---------------------------------------------------------------
ఋతువులు  సైతము తమ  వేషమ్ము మార్చుకొని
అవసరానికి కరుణించని వరుణదేవుడు కూడా 
పండిన పంటపై పడి రొచ్చు ..రొచ్చు చేయునుగదా !
వినుము  కె.ఎల్వీ.మాట  నిజము  సుమ్ము....!!
-----------------------------------------------------------------

కామెంట్‌లు