*అమ్మయే ఆధారము*(కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 1)
దేవతలకు దానవులకు వైరము
ఎప్పుడూ వుండదు మమకారము
జరిగింది యుద్ధము క్రోధమయి
అయ్యింది దేవతలది పైచేయి!
2)
గెలిచారు దేవతలు అమ్మవలన
గెలిచామని అనుకున్నారు తమవలన
అప్పుడే ఆవిర్భవించె యక్షుడు
దేవతల బలపరీక్షా దక్షుడు!
3)
దేవతలు యక్షునిజూసి కంపించారు
అతనివద్దకు అగ్నిని పంపించారు
యక్షునిముందు అగ్ని బీరాలుపలికాడు
యక్షపరీక్షలో నెగ్గలేక వెనుదిరిగాడు!
4)
అప్పుడువారు బాగా ఆలోచించారు
అక్కడికి అనిలుని పంపించారు
యక్షునిముందు అనిలుడు బీరాలుపలికాడు
యక్షపరీక్షలో నెగ్గలేక వెనుదిరిగాడు!
(సశేషం)

కామెంట్‌లు