మంచి స్నేహితుడు ( బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

రాముడు వచ్చాడు
భీమున్ని చూశాడు
రా రమ్మని పిలిచాడు
బడికి పోదా మన్నాడు

భీముడు రానన్నాడు
రాముడెళ్ళిపోయాడు
లక్షణంగా చదివాడు
కొలువులోన చేరాడు

భీముడు తిరుగుతూ
జులాయిగ మారాడు
ఉలుకు పలుకు లేకుండ
ఊరొదిలి వెళ్ళాడు

రాముడు వాణ్ని చూసి
ఎంతో బాధపడ్డాడు
ఇంటికి తీసుకు వచ్చాడు
కొత్త దుస్తులు ఇచ్చాడు

మంచి మాటలు చెప్పాడు
వాని లో మార్పు తెచ్చాడు
కొలువులో వాన్ని పెట్టాడు
బ్రతుకు దెరువు చూపాడు

కామెంట్‌లు