కిరణ్ కుమార్ కు వరల్డ్ అచీవర్ అవార్డు


 తిరుపతికి చెందిన వరల్డ్  అచీవర్స్ పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాసకర్త రచయిత డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు వరల్డ్  అచీవర్ అవార్డు ప్రముఖులచే  ప్రదానం చేయనున్నట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ పైడి  అంకయ్య  తెలిపారు.   ఈనెల 24 శనివారం హైదరాబాద్ లో  ఉదయం తెలంగాణ సారస్వత పరిషత్ సభా ప్రాంగణంలో ఇటీవలి కాలంలో అతి తక్కువ సమయంలో 400కిపైగా వ్యాసాలు 52 పత్రికలలో ప్రచురణ అయినందుకు  గాను తమ సంస్థ ద్వారా ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ఒక  ప్రకటనలో తెలిపారు.