గుడ్లగూబ (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట

పగటిపూట పడుకుని
రాత్రిపూట మేల్కొని
చిత్రంగా ఉంటుందది
దాన్ని మీరు చూశారా

దాని అరుపు విన్నారా
గుప్ గుప్ మని అరుస్తుంది
దాన్ని కళ్ళను చూశారా
చక్రం వోలె ఉంటాయి

దాని కళ్ళు చీకట్లొ చూస్తె
మిలమిల మెరుస్తాయి
దాని అరుపు వింటే చాలు
పెద్దలు నిద్ర లేస్తారు

రాళ్ల తోటి కొడతారు
పో పోమ్మని అంటారు
దాని పేరు తెలుసా 
గుడ్లగూబ అంటారు