గురు,శిష్య సంబంధం,సముద్రం(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

          :గురుశిష్యుల సంబంధం:
నడుపు శిష్యుల నిరతము నాన్న తీరు
మమత పంచుతూ వారల మాట వినును
జీవన విలువల బోధించి జీవ మిచ్చు
మదిని గెలిచిన ఛాత్రులు మరువ లేరు
            :సముద్రం:
తాను లవణాన్ని దండిగా తాగ గలిగి
వరద వచ్చిన‌ రోజున వార్థి గాను
అలల పరదాలు తాకుచు ఆట లాడ
నిలుచు భవనము మాదిరి నిజము కాదె