చక్కని వెదురు
లేదిక బెదురు
అల్లిక కుదురు
ఉపాధి సులువుగ అందునుమా!
ఏపుగ పెరుగును
చిట్టడవి లోను
పొదలుగ అతుకును
వెదురుకు పచ్చని వెలుగులుమా!
వేణువు గాయము
పలుకును రాగము
మోహన తీరము
బృందావనమది గురుతు ఉమా!
కూరల అరలును
చేటలు గంపను
పూల సింగిడిను
కుర్చీ సోఫా సెట్టు ఉమా!
ప్రకృతి అందములు
సహజ వస్తువులు
గృహమున శోభలు
ఖరీదయిన హాబీలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి