సూక్తిసుధ:-*మిట్టపల్లి పరశురాములు*

 
కం
పనులను జేసెడివేళలొ
కనులనుమూయంగరాదుకైవల్యమందున్
జనులకునిదియేస్ఫూర్తిగ
వినయము పొంగంగమేదివేల్పుగకొలుచున్
కం
చెప్పుడు మాటలు వినకుము తప్పుడుపనులనుసలుపకుతగదుగమీకున్
గొప్పలుచెప్పకునెప్పుడు 
ముప్పులమబ్బులుముసురునుమోహమునీడన్
ఆ.వె
బట్టతలనుయున్న-భాగ్యవంతుడు కాదు 
పట్టుదలతొమనిషి -ప్రతిభజూపి
పనులుజేయకలుగు-భాగ్యమ్మునిలయందు
తెలసిమసలుకొనుము-తెలుగుబిడ్డ