నిజం నిప్పు. ..అచ్యుతుని రాజ్యశ్రీ

 క్లాస్ లో తెలుగు టీచర్ సత్యహరిశ్చంద్ర కధచెప్పి సాధ్యమైనంత వరకూ  మనం నిజం చెప్పాలి.మన వివరాలు  విషయాలు సేకరించి  ఆపై మనకు  టోపీపెట్టి మనల్ని  బ్లాక్ మెయిల్ చేసేవారు ఇప్పుడు తయారైనారు. అందుకే కొత్త వారికి ఏమీ చెప్పవద్దు.క్లాస్  చదువు విషయం లో మనం  నిజాయితీగా   సత్యం చెప్పాలి. నేడు దొంగ సర్టిఫికెట్లు    తో చదువు  ఉద్యోగం సంపాదించినా ఎప్పటికైనా  నిజం బైట పడితే ముప్పు తిప్పలు తప్పవు. మీకు  ఓ చిన్న పరీక్ష  పెడుతున్నాను. మీఅందరికీ తలాఒక  గింజ ఇస్తాను.మంచి మట్టిలో పాతేసి  ఓనెల తరువాత మొక్క మొలిచాక తీసుకుని రండి.మంచి బహుమతి ఉంటుంది. " మాష్టారి మాట తో పిల్లలు అంతా  హే హాయ్ హాయ్ అని ఉషారుగా అరిచారు.వరుసగా అటెండన్సు రిజిష్టర్ లో ఉన్న ప్రకారం  అందరికీ తలా ఒక గింజ ఇచ్చారు. ఇంటికెళ్లాక అంతా ఉషారుగా  పాతారు.రేపే బడికి మొక్కను పట్టుకుని వెళ్ళాలి.అంతా తమ   మొలకలను చూసి  ఆనందంగా ఉన్నారు. హరికి నిద్ర పట్టడంలేదు. "అమ్మా!నా గింజ  మొలక ఎత్తలేదు. ఏంచేయాలి?ఏదో ఒక మొక్క అందులో  పాతి తీసుకుని వెళ్లేదా అమ్మా?" అమ్మ ఏమందో తెలుసా? "చూడు నాన్న! చిన్న విషయానికి అబద్ధం ఆడితే బతుకు నరకం.ఎవరూ నమ్మరు.ప్రైజ్ కోసం అబద్ధం ఆడతావా?మొలక రాలేదు రోజూ నీరు పోస్తున్నా.మా అమ్మ కూడా చూస్తోంది. "అని నిజం చెప్పు.
     ఆమర్నాడు  బడిలో అంతా తమ రకరకాల మొలకలు చూపి సార్  పిల్లలచేత శభాష్  అనిపించుకున్నారు.హరి బిక్కమొహంవేసి తన కుండీ చూపాడు. నిజం చెప్పాడు.
బడిలో పిల్లలు అంతా ప్రార్ధన చేయటానికి  లైన్లో నిలబడ్డారు.
 అసెంబ్లీ ముగిశాక  హెచ్. ఎం."బెస్ట్ బాయ్!హరికి  116రూపాయలు బహుమతి. నీతి నిజాయితీగా  సత్యం చెప్పాడు.అందరికీ  మీసార్ ఉడుకబెట్టిన గింజలు ఇచ్చారు. మీరు  రకరకాల మొక్కలు పెట్టితెచ్చారు.హరి తల్లి  పిల్లాడిపెంపకం లో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నదో చూడండి. తండ్రి లేని పిల్లాడి ని తను ఇళ్ళల్లో పనిచేస్తూ  చదివి స్తోంది. ఇలాంటి  నీతినిజాయితీ ఉన్నవారే దేశం కి అవసరం.లంచాలు తీసుకోరు.శత్రువు కి మనదేశ రహస్యాలు చెప్పరు.టెర్రరిస్టులుగా మారరు.ఇంత చిన్న విషయానికి ప్రైజ్ కోసం అబద్ధం ఆడిన మీరు  మీ కుటుంబం ఊరు రాష్ట్రం దేశం కి ద్రోహం చేస్తున్నారు. "
అంతా సిగ్గు తో తలలు వాల్చారు.