ఆదివారము (బాల గేయము)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

ఆదివారమే కావాలి
బడులు లేకుండా ఉండాలి
ఆటలతో పాటలతో 
ఆనందంగా ఉండాలి 

బాలల మాటలు విందేమో
కరోనా వచ్చి వాలింది
భౌతిక దూరం పెంచింది
లాక్ డౌన్ ను తెచ్చింది 

బడుగులకు ఇంకా ఆదివారమే 
సోమవారమే లేదంది
 ఆటలు పాటలు మింగింది
 బడికి తాళమే వేసింది.