: "చైతన్య శిఖరం" (సీసమాలిక) :-అన్నల్ దాసు రాములు సిద్దిపేట
సీః
దండిది గ్రామము ధరచిన్న గూడూరు
    పండితులున్నట్టి పాకలోన
ధాశరథినియింట యశముగా వెలిగెను
    కృష్ణమా చార్యుడే కరుణ మయుడు
అవనిపైనున్నట్టి అసమానతలగూర్చి
    బడిపంతులుగమారి భవితనేర్పె
ఆకాశ వాణిలో అందరి మన్నన
    ప్రజల వాణినిదెల్పి ప్రజ్వరిల్లె
నైజాము నెదిరించి నవశకంబునురాసి
    సాయుధ పోరుకు సానవట్టె
జైలు గోడలయందు జైతెలంగాణమే 
    కోటి వీణలనన్ని మీటెతాను
అగ్నిధారగవెల్గి అభ్యుద యమునయ్యి
    రుద్రవీణగమారె రోషముగను
ధిక్కార స్వరముతో దీనులాకండగ
    దులుపుటానికి బూజు కలమువట్టె
ఆస్థాన కవిగాను అలరారె అతనెంతొ
    పామర్లు మెచ్చిన పండితుండె
అలుగు నేనేనన్న పులుగు నేనేనన్న
    వెలుగు నేనేనన్న తెలుగువాడు

పద్య గద్యము రాసిన ప్రజ్ఞనతడు
గేయ కావ్యంబులల్లిన గీతమతడు
చిత్ర సీమను యేలిన గాత్రమతడు
మరిచి పోలేని తెలగాణ మనిషియతడు

      

కామెంట్‌లు