*ఎదగడం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.చదువు ఉన్నతం!
   సంపాదన ఉత్తమం!
   అధికారం ఉన్నతోన్నతం!
   ఠీవిగా నిలబడడం!
2.అడ్డొచ్చే అవరోధాలు!
   ఇరుకున పెట్టే ఇబ్బందులు!
  వంగదీసే ఓటములు!
  ఎదరిస్తూ పోవడం!
3.ఇష్టపడే అభిరుచులు!
   ఆశపడే అందలాలు!
   నిలబడే ఆదర్శాలు!
   సాధించి చూపడం!
4.వెలేసినవాళ్ళని!
   వ్యతిరేకించినవాళ్ళని!
   వెక్కిరించినవాళ్ళని!
   అలవోకగా దెబ్బ కొట్టడం!
5.మంచి భావించడం!
   మంచి పెంచడం!
  మంచి పంచడం!
  మంచి మిగిల్చి పోవడం!
  మనిషి నిజంగా ఎదగడం!