సూక్తి సుధ:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట*

 *తే.గీ*
*మనుజు నెదలోనయోచన-మంచిదైన*
*శాంతి సుఖముసిరులుగల్గు-సంతసమున*
*గానమేలిమితలపులె-ఘనముగాను*
*మనల నడిపించు ప్రగతిని-మాన్యులార!*
*నాదినాదియనుచు-వాదులాడవలదు*
*ఏదినీదిగాదు-మోదమునను*
*పేరుకీర్తిధరను-పెన్నిధిదెలియరా!*
*తెలసిమసలుకొనుము-తెలుగుబిడ్ఢ*
 *తే.గీ*
*వియ్యమొందినవారికి-విధిగచాల*
*సేవలెన్నియొజేయాలి-చెలిమిచేత*
*కయ్యమెప్పడుకూడదు-కలసిమెలసి*
*తగినమర్యాదలనుజేయు-దప్పకుండ*