గౌరీ శంకరుడు (బాల గేయం) పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

గలగల పాట పాడింది 
గాలిలోన ఎగిరింది
గిరగిర తిరిగి ఆగింది
గీతలు ఎన్నో గిసింది 

గుడి ముందు ఆగింది
గూటిలో పక్షి ని చూసింది
గెలుపె తన దంది
గేటు తీసి నడిచింది

గైర్హాజరు లేవంది 
గొలుసులు చూసి మురిసింది 
గోడ రంగులు చెప్పింది 

గౌరీశంకర్ ను మొక్కింది 
గంటలు గణ గణ కొట్టింది