*తాబేలు - కుందేలు*(కథ)("రాజశ్రీ" సాహిత్య ప్రక్రియలో)(ఐదవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 17)
తాబేలు అసలే కనబడలేదు
కునుకొకటి తీస్తే ఏలోటురాదు
తాబేలు ఎప్పటికీ రాలేదు నిజం
ఎప్పటికీ నాచేజారదు విజయం!
18)
అని తలచిన కుందేలంట
ఒక చెట్టునీడన నిద్రించిందంట
కొంత తడవుకు లేచింది
తాబేలు కోసం చూసింది!
19)
తాబేలు కుందేలుకు కనబడలేదు
ఇప్పుడప్పుడే నాదాపులకు అసలే రాబోదు
అని గర్వముతో కుందేలు
మళ్ళీ పోయింది నిద్రలు!
20)
తాబేలు నెమ్మదిగా నడిచింది
గమ్యము చేరి పోయింది
అప్పుడు కుందేలు లేచింది నిదుర
గబగబ ఉరికింది కదర!
(ఇంకావుంది)