వచన పద్యాలు :-: చెన్నా సాయిరమణి

 1)అనంత అపూర్వ అన్వయ అజంత
ఆమని ఆకాంక్ష ఆనంద ఆటల
ఇంద్రాణీ ఇందిర ఇంతుల ఇష్టంబు భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

2)కమనీయ రమణీయ నవ్య భవ్య 
నవనీత సుందర సుమధుర తియ్యని 
తేనేలొలుకు హరిత కాంతుల తెలుగు భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

3)క్షయ క్షాత్ర క్షీర క్షేత్ర 
క్షున్మము క్షేత్రజ్ఞ క్షణ క్షోభనాశన 
క్షత్రియ కీర్తి గడించిన క్షర భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !

4)పరమ పావన ప్రియంబు పదముల 
పరమ ప్రీతికరం పద్య ప్రౌఢత్వం 
పరమ పూజ్యనీయం ప్రజ్ఞ తెలుగు భాష 
వినరా బిడ్డా !మన తెలుగు భాష !

5)తేనేలొలుకు తియ్యని కమ్మని మృదు 
మధుర భావలాలిత్య పదముల 
ఒంపు సొంపుల ఒనమాలు సుందరి భాష 
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
----------------------------------------
 చెన్నా సాయిరమణి 
పెంట (గ్రామం ), పద్మనాభం (మండలం )విశాఖపట్నం (జిల్లా )
MA తెలుగు 
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి )
కామెంట్‌లు