నందన వనం; కె. వెంకట రమణ రావు

 రాత్రి భోజనాలు అయ్యాయి. వంటిల్లు సర్దడం లో బిజీ గా ఉంది నా శ్రీమతి. హోమ్ వర్క్ అయిపోయింది అంటూ గట్టిగా అరిచి నా దగ్గరకి వచ్చాడు మా చిన్నా. 
వాడికి పక్క సర్ది పక్కన పడుకున్నాను
నాన్నా అసలు ఈ స్కూల్ పుస్తకాల్లో చెప్పినవి ఏవీ కూడా బయట ఎవరూ చెయ్యరు ఎందుకు , మాకు మాత్రం పాఠాలు చెప్పి పరీక్షలు పెడతారు అంటూ విసుగ్గా చెప్పాడు.
ఏమైంది చిన్నా ఎందుకు అలా అంటున్నావు అని అడిగా.
అవును నాన్నా , ట్రాఫిక్ రూల్స్ చెప్పారు , కానీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు చూస్తే చాలా మంది అసలు పాటించరు. ఆ ట్రాఫిక్ రూల్స్ ఎక్కడ రోడ్డు మీద కనిపించవు.
బస్ లు లారీలు కార్ల తో కాలుష్యం అని చెప్పారు. మరి అందరూ మోటార్ సైకిల్స్ , కార్లు బస్సులు లో నే వెళ్తున్నారు
ఫ్యాక్టరీ ల వల్ల గాలి కలుషితం అని చెప్పారు. మరి నువ్వు ఫ్యాక్టరీ లో నే పని చేస్తున్నావు 
చెత్త రోడ్డు మీద వెయ్యకూడదు రోగాలు వస్తాయి అని చెప్పారు. మరి మన ఇంటి ఎదురుగా అందరూ చెత్త రోడ్డు మీద వేస్తున్నారు . 
మరి మాకు ఎందుకు నాన్నా స్కూల్ లో ఇలా చెయ్యాలి అని చెప్తారు. చిన్నా అవేశం గా చెప్తున్నాడు.
నిజమే , ఎదిగే పిల్లల్లో వాళ్ళు ఎది చూస్తే అది వెంటనే నేర్చుకుంటారు. చదువుతున్నది ఒకటి , చుట్టూ సమాజం లో చూస్తున్నది ఒకటి. మరి ఈ పసి మెదడులో ఇలాంటి వి నాటుకుంటే రేపు సమాజం అంతా పూర్తిగా కలుషితం అయిపోతుంది.
పర్యావరణం ఒక్కటే కాదు మనసులు కూడా కాలుష్య రహితం గా ఉండాలి. ఏ విత్తనము వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది.
సరే చిన్నా , నేను చెప్తా విను అంటూ చిన్నా కి కొన్ని విషయాలు చెప్పాను.
మనం బియ్యం తెచ్చుకుంటాం కదా , అందులో రాళ్ళు కూడా ఉంటాయి, మనం ఏం చేస్తాం , ఆ రాళ్లు ఏరి బియ్యం శుభ్రం చేసుకుంటాము. అలాగే బయట సమాజం లో కూడా రాళ్ల లాంటి మనుషులు ఉంటారు. మన ప్రభుత్వం వాళ్ళని పట్టుకుని ఫైన్ వేస్తుంది. ట్రాఫిక్ అయితే కానీ , కాలుష్యం అయితే కానీ , ఏదైనా సమాజం కి ప్రమాదం కలిగించే ప్రతి వాళ్ళని ప్రభుత్వం శిక్ష వేస్తుంది , జైల్ లో పెడతారు. మనం ఎప్పుడు రూల్స్ అన్నీ తప్పకుండా పాటించాలి. 
మీ స్కూల్ బస్ డ్రైవర్ ఇప్పుడు కొత్త వాడు వచ్చాడు కదా అన్నాను. అవును నాన్నా పాత డ్రైవర్ మానేశాడు. 
 మానేయడం కాదు , మీ స్కూల్ వాళ్ళు అతనిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఎందుకో తెలుసా, వరసగా మూడు సార్లు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగకుండా బస్ నడిపాడు . సీసీ కెమెరా లో అది రికార్డ్ అయి ,మీ స్కూల్ వాళ్ళకి , నోటీస్ వచ్చింది . అందుకే ఆ డ్రైవర్ ని ఉద్యోగం నుంచి తీసేశారు తెలుసా అని చెప్పాను .
మంచి పని చేశారు నాన్నా అన్నాడు చిన్నా.
కాబట్టి చిన్నా పుస్తకాల్లో పాఠాలు అన్నీ బాగా చదవాలి ఎప్పుడూ మంచి క్రమశిక్షణ తో ఉండాలి తెలిసిందా. అందుకే బాగా చదువుకో. 
అవును నాన్నా నేను బాగా చదువుతా , అన్నీ తప్పకుండా పాటిస్తా, మా ఫ్రెండ్స్ అందరికి ఇది చెప్తా రేపు స్కూల్ లో అంటూ నిద్రలోకి జారుకున్నాడు చిన్నా. 
ఏంటి చిన్నాకి అంతసేపు లెక్చర్ ఇస్తున్నారు అంటూ వచ్చింది నా శ్రీమతి.
 ఈ పసి వాళ్ళు సమాజం లో చెడు చూస్తున్నారు , పుస్తకాల్లో మంచి చదువుతున్నారు . వాళ్ళ మనసులు గందరగోళం గా తయారవుతున్నాయి. పిల్లల సందేహాలు , వాళ్ల మనసుల్లో అలజడిని అర్థం చేసుకుని సందేహాలు తీర్చే , ఓపిక,తీరిక ఈ రోజుల్లో స్కూల్ టీచర్లకు లేదు. సిలబస్ అయిపోతే చాలు వాళ్ళకి. మరి పిల్లల సందేహాలు తీర్చి వాళ్ళని సరైన దారిలో పెట్టే బాధ్యత తల్లి తండ్రుల మీద కూడా ఉంది. కానీ పిల్లలతో మనం ఎంతసేపు గడుపుతున్నాము . ఇద్దరమూ ఉద్యోగం చేస్తున్నాము. ఏదైనా సరే వీలైనంత సమయం పిల్లలతో గడుపుదాము. మన వంతు బాధ్యత మనం పాటిద్దాం. 
మీరు చెప్పింది చాలా నిజం. మనం ఎంత సమయం పిల్లల తో ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఆలోచిస్తారు అంటూ అందరం నిద్రలో కి జారుకున్నాము.
K VENKATA RAMANA RAO
VISAKHAPATNAM
MOBILE 9866186864
కామెంట్‌లు