ముల్లంగి - ఔషధ గుణాలు -పి . కమలాకర్ రావు

 ప్రతి నెల రుతుక్రమం  సరిగా  రాని స్త్రీలకు, మరియు  వీర్య కణాల  ఉత్పత్తి  తగ్గిన పురుషులకు ముల్లంగి గింజల  పొడి  ఉపయోగ పడుతుంది.
  కాషాయం  తయారీ  విధానం.
ఒక స్పూను  ముల్లంగి గింజల పొడి + అర  టీ  స్పూను  నల్ల జిలకర పొడిని  ఒక గ్లాస్ నీటిలో వేసి  మరిగించి కొద్దిగా తాటి బెల్లం  కలిపి చల్లారిన తరువాత త్రాగాలి.
ఇలా కొన్నాళ్ళు త్రాగితే స్త్రీలలో రుతుక్రమం సరిచేయ బడుతుంది.
 పురుషులలో వీర్య కణాల ఉత్పత్తి
పెరుగుతుంది.
మూత్ర  ద్వారములో  మంట తగ్గడానికి, ముల్లంగిని దంచి రసం తీసి పెరుగులో కలిపి త్రాగాలి. మూత్ర ద్వారం లో  మంట తగ్గుతుంది.  మహిళల్లో కొందరికి
తెల్ల బట్ట ( White discharge) వున్నా కూడా తగ్గి పోతుంది.
పుళ్ళు పుట్టవు. ఇది cancer రానివ్వకుండా నిరోధిస్తుంది.