పుల‌స*- చేప‌ల రారాజు...!!:--------డి.జి.కల్యాణ్ కుమార్ తూర్పు గోదావరి

 🐟ఖండాలు దాటుకుంటూ వ‌చ్చి మ‌న‌కు మాత్ర‌మే దొరికే చేప‌- పుల‌స‌.! "పుస్తెల‌మ్మి అయినా పులస తినాలి" అని ఊరికే అన‌లేదు మ‌రి! గోదావ‌రి నీటికై ఖండాలు దాటుకుంటూ వ‌చ్చే ఈ చేప స్టోరి మీరు చ‌ద‌వండి!🐟
🐠వ‌ర్షాకాలంలో మాత్ర‌మే దొరికే అరుదైన చేప- పుల‌స‌.! పుస్తెల‌మ్మి అయినా పులస తినాలి అనే సామెత‌ను బ‌ట్టి చెప్పొచ్చు ….ఆ చేప టేస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో.! ఈ చేప కేవ‌లం గోదావ‌రిలో మ‌రియు హుగ్లీ న‌దిలో మాత్ర‌మే దొరుకుతుంది.! కానీ గోదావ‌రిలో దొరికే చేప టేస్ట్ చాలా బాగుంటుంది!🐟
🐟ఖండాలు దాటుతూ….గోదావ‌రికి చేరుతుంది!
ఈ చేప‌లు ఆస్ట్రేలియా న్యూజీలాండ్ నుండి హిందూ మహాస‌ముద్రం మీదుగా ప్ర‌యాణం చేసి బంగాళ‌ఖాతంలోకి ప్ర‌వేశిస్తాయి! గోదావ‌రి న‌ది అంత‌ర్వేది వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది…ఈ క్ర‌మంలో అప్ప‌టికే బంగాళ‌ఖాతానికి చేరిన ఈ చేప‌లు గోదావ‌రి న‌ది ప్ర‌వాహానికి వ్య‌తిరేఖంగా వేగంగా ఈదుకుంటూ వెళ్తాయి.! స‌ముద్ర‌పు ఉప్పునీటి కంటే గోదావరి తీపి నీటిలో గుడ్లు పెట్టాల‌నే కార‌ణంతో…..!🐠
🐟స‌ముద్రంలోనే విల‌స‌లే…. గోదావ‌రి న‌ది నీటిలోకి వ‌చ్చాక పుల‌స‌లుగా మారుతాయి!వాస్త‌వానికి స‌ముద్రంలో ఉన్న‌ప్పుడు వీటిని విల‌స‌లు అంటారు…ఉప్ప‌నీటిలో ఉండ‌డం కార‌ణంగా అప్పుడు అంత టేస్ట్ ఉండ‌వు…గోదావ‌రి నీటిలోకి చేర‌గానే ఈ చేప‌కు అద్భుత‌మైన టేస్ట్ వ‌స్తుంది!🐟
,🐟ఆడ‌పుల‌స‌ల‌కు డిమాండ్ ఎక్కువ‌!
పుల‌స చేప‌ల్లో ఆడ చేప‌కు అది కూడా గ‌ర్భంతో ఉన్న ఆడ‌చేప‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది! ఇత‌ర చేప‌ల‌తో పోలిస్తే ముల్లులు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ ….దీని రుచి రీత్యా దీనికి డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంది. అది కూడా ఈ చేప‌లు ఆగ‌స్ట్ నుండి సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లోనే దొరుకుతాయి కాబ‌ట్టి మ‌రింత డిమాండ్ ఉంటుంది!🐠
🐠పుల‌స ఇత‌ర విశేషాలు🐟
🐠*వ‌ల‌లో ప‌డగానే చ‌నిపోతాయి!
*సంక్రాంతికి బంధువులు వ‌చ్చిన‌ట్టే…..పుల‌స‌లను తిన‌డానికి కూడా ప్ర‌త్యేకంగా బంధువులు వ‌స్తుంటారు!
*మ‌త్స్య‌కారులు క‌డుపునిండా తిండి తినేది ఈ సీజ‌న్ లోనే….పుల‌స పేరుతో కొద్దోగొప్పో కూడ‌బెట్టుకుంటారు!
*పుల‌స‌కు ఉన్న డిమాండ్ కార‌ణంగా న‌కిలీ పుల‌స‌ల‌ను మార్కెట్ లో అమ్ముతున్నారు…పుల‌స‌లుగా మార‌క‌ముందే స‌ముద్రంలో దొరికే విల‌స‌ల‌నే పుల‌స‌లుగా అమ్ముతుంటారు. *విల‌స‌లు – న‌లుపు, ఎరుపు రంగులో ఉంటాయి. పుల‌స‌లు వెండి క‌ల‌ర్ లో ఉంటాయి🐟🐟