*పరిణామం!* (కొనసాగింపు):-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 
9.
  అవసరాలు! అధికం!
   సౌకర్యాలు! చాలవు!
   భోగాలు! తృష్ణే!
   స్వర్గం అందినా తృప్తే లేదు!
10.
     వేదం -వాదం!
     సంవాదం- వివాదం!
     భాషణం- ద్వంద్వార్థం!
     కట్టుబాటు- విరగబాటు!
11.
     ఆర్షవిద్య-ఆంగ్లవిద్య!
     ఆయుర్వేదం-ఆంగ్లవైద్యం!
     విద్య, వైద్యం- వ్యాపారం!
     దైవం- అదే మార్గం!
12.
    పంచభూతాలు మాలిన్యం!
  మోసం నేర్చుకున్న నైపుణ్యం!
  బతికేయడం చాలా ముఖ్యం!
  ఎలా? ఏమిలేదు ప్రాముఖ్యం!
   *( రేపు కొనసాగింపు)*

కామెంట్‌లు