తెలుగు బడులు:-సత్యవాణి కాకినాడ
తెలుగు బడులు 
తెలుగు బడులు
వేలాదిగ వెలుగు బడులు

వీధి అరుగు బడులనుండె
వెలుగొందిన తెలుగు భాష
మధురమైన తెలుగు భాష
మహా కావ్యములున్నభాష

ఆదినుండి ఆంధ్రులకు
అందుబాటు లోనిభాష
పాలు కుడుచు పాపలనుా
పలకరించు మేలి భాష

ఆరున్నర కోట్ల ప్రజలందరు
ఆదరించు మేటి భాష
అందమైన నుడులతో
అలరించెటి అమ్మ భాష

మాటలందె సంగీతపు
మధువులొలుకు మేలిభాష
వేలదిగ సాహిత్యపు
విలువలున్న తెలుగు భాష

దొరలుకూడ మెచ్చినట్టి
మేల్ భాష తెలుగుభాష
ఆంగ్ల భాష యందు కూడ
అనువదించినట్టి భాష

వేలాదిగ సుకవులు
వెలుగులీనినట్టి భాష
పర భాషా ప్రభువులంత
ప్రశంసించినట్టి భాష


కోట్లాదిగ తెలుగువారు
కొలుచునట్టి తెలుగు భాష
మరుగ పడగఒప్పనట్టి 
మాతృభాష తెలుగు భాష

ఆరున్నర కోట్ల ప్రజలు
అందరు ఒక్కటికండి
అధినాయక ఆజ్ఞలను
ధిక్కరించ మేలండి

అధినేతలు చదివిందీ
ఆంధ్రభాష మాద్యమమే
ఆవిషయం గుర్తుజేయు
ఆవశ్యం మనదండీ

               

కామెంట్‌లు