మాయదారి నక్క (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

మాయదారిదా నక్క
మొసపోస్తు వచ్చింది
మక్కచేల్లో దూరింది
మక్కువతో మురిసింది

మక్క బుట్టలిరిసింది
పొట్ట నిండ మెక్కింది
అటుఇటు తిరిగింది
ఊత పెట్టి అరిచింది 

నక్క అరుపు విన్నాడు
దుడ్డు కర్ర పట్టుకుని
గబగబా రైతు వచ్చాడు
నక్కను తరిమి కొట్టాడు

కుర్రోమొర్రో అనుకుంటు
కాళ్ళకు పని చెప్పింది
చేను చెలుక దాటింది
అడవి బాట పట్టింది