*దాశరథి కృష్ణమాచార్య*;- బెజగం శ్రీజ గుర్రాల గొంది

 
*తేటగీతి*
పద్యమల్లుటలోనను ప్రతిభజూపి
కృష్ణమాచార్య గొప్పగా విష్ణు డివలె
ప్రజలపైమక్కువనుజూపి బాగుకోరి
ధైర్యమునునింపె చక్కగా దాశరథియె
*కందం*
ప్రజల తరపునను నిలబడి
నిజాంనుభయపెట్టినాడు నిక్కముతోడన్
యజమునుజేసియుదండిగ
నజరామరుడయ్యెనతడు నవనీస్థలిపై
*సీసమాలిక*
చిన్నగూడూరుయే మిన్నగా నుండియు
నభివృద్ధిచెందెనె యవనిలోన
దాశరథిగతాను ధన్యుడైవెలుగొందె 
కృష్ణమాచార్యులు క్షేమమెరిగి
చిన్నతనమునుండి సేవలుజేసియు
సాయుధపోరులో శ్రద్ధజూపె
పద్యమల్లుటలోన ప్రావీణ్యతనుపొంది
చక్కగారాసెను సంతసమున
పద్యాన్నిగొప్పగ పదునైననాయుధం
గామలచెనుతాను గౌరవముగ
తెలగాణరైతుదే తేజరిల్లెవిధాన
నినదింబుజేసెను నేర్పుతోడ
దొరపెత్తనంబున దూసుకెళ్లుచుసాగి
గడగడవణికించె దడలుబుట్ట
జైలుగోడలలోన జగతియే మెచ్చగ
రచనలుజేసెను లక్షణముగ
వీరుడైప్రభవిల్లి ధీరుడిగగెలిచి
ధైర్యంబు కనబర్చె దండిగానె
*తేటగీతి*
ఉద్యమస్పూర్తినేనింపి నుద్యమాన
ప్రజలమేల్కొల్పె నప్పుడు పౌరుషమున
దొరలనెదిరించితెగువతో దూసుకెళ్లి
అందరిమనసులుగెలిచె పొందుగాను.
కామెంట్‌లు