మహామంత్రి తిమ్మరుసు(ఇష్టపది)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్
మహామేధ కలిగిన మంత్రిగా వెలిగాడు
కృష్ణదేవరాయల కృతజ్ఞతలు పొందిన

సమర్థ గురువు గాను సామర్థ్య శక్తిగా
రాజ్యక్షేమానికి రాజనీతికి నిలిచి

ప్రభువుకు మార్గదర్శి ప్రజలకు హితవరిగా
శత్రువులకు సింహమైన శాంత గంభీరమై

వాత్సల్యమిచ్చినా వారధిని కట్టినా
విజయనగర గౌరవ విధేయుడు తిమ్మరుసు


కామెంట్‌లు