బోనం:- సామలేటి లింగమూర్తిసర్వక్రియ త్రీభాష కవి శతాధికగ్రంథకర్త సిద్దిపేట

 కం:అమ్మకు బోనము తీసిన
      యిమ్మహి భాగ్యాలుగలుగు యిచ్చును శుభముల్ 
      కమ్మని బెల్లము సాకను
      సమ్మతితో పెట్టివేడ సంతోషించున్

 కం: అప్పలు బెల్లము యన్నము
        వొప్పుగ నైవేద్యమొసగ వుల్లము మెచ్చున్
         తప్పులు మన్నించి మనల
         మెప్పుగ కాపాడు నెపుడు మీనసునాక్షీ
        
          

కామెంట్‌లు