కనవి నిజం ప్రకృతి సహజం:-మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా

 సీసమాలిక పద్యం

రవి గాంచనిది కవి రమ్యముగాంచియున్ 
వర్ణించి జూపును వసుధనంత,
ప్రకృతి శోభను గని భావాల నొలకించు
కవి మేధ మదియించి కలము నుండి,
యితిహాస కథలెన్నొ యింపుగన్ రచియించి
మానవ నడకను మనకు తెల్పె
రామాయణము లోని రాముని పాత్రయె
ఆదర్శ మాయెను నందరికిని,
సూర్య చంద్రులవలె చూపును సారించి
కాల గమనమును కవులు జూపు
బీదల బ్రతుకుల పెన్నిధి  కవియైన
పత్రికలకు రాసి ప్రజలకు తెల్పు,
ప్రజలకు  కవి నిజం ప్రకృతియె సహజము
పడతుల వర్ణన పరవశించు,
అవినీతి నిలదీసి నంతమొందించెడి
కవి కవనమున బుట్టు ఘనముగాను.
తేటగీతి.
రాజు పరిపాలనంతయు రమ్యముగను,
కవి కలమున నిలుచును గనగ చరిత,
ప్రకృతి శోభలు సహజము ప్రజల కింపు,
కడకు కవుల పేర్లు నిలుచు కలియుగాన.