*తాబేలు - కుందేలు*(కథ)("రాజశ్రీ" సాహిత్య ప్రక్రియలో)(ఆరవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 21)
అప్పటికే చేరిన తాబేలు
కన్నుల జూచింది కుందేలు
కుందేలు ఆశ్చర్య పోయింది
నమ్మలేక భూమిపై కూలిపోయింది!
22)
అప్పుడు పిట్టలు అన్నాయి
తాబేలు కుందేలు విన్నాయి
ఇంత వింతనుమేము చూడలేదెపుడు
అంత గర్వము పనికిరాదెపుడు!
23)
ఆత్మవిశ్వాసము ప్రజ్ఞ దీక్ష
ఆత్మశక్తి అవుతాయి రక్ష
గర్వము కూడదు నిలువెల్లజెరుచు
మంచితాబేలు ఇదిఅన్ని మరచు!
24)
ఇద్దరూ సఖ్యముగ ఉండండి
అందరితో స్నేహముగ కలిసిపోండి
ఒకరినొకరు లోకువగా చూడరాదు
జగతికి ఇదియే మంచిపాదు!
(సమాప్తము)