వంటింట్లో వైద్యం(కైతికాలు):-తాళ్ల సత్యనారాయణ-హుజురాబాద్.

మెదడు పనితీరును
మెరుగుపర్చు దాల్చిని
నియంత్రణలో ఉంచు
కొలెస్ట్రాల్ స్థాయిని
పోపుదినుసు వైద్యము
వంటింట్లో లభ్యం

బిర్యాని ఆకులోన
విటమిన్ ఎ లభించు
ఫోలిక్ ఆసిడ్లు
పోషకాలు లభించు
పోపుదినుసు వైద్యము
వంటింట్లో లభ్యం

ఇంగువను అహారంలొ
భాగంగా చేసుకున్న
జీర్ణక్రియ మెరుగుపడి
లాభాలు కలుగునన్న
పోపుదినుసు వైద్యము
వంటింట్లో లభ్యం

ఎండుమిర్చిలో దొరుకు
విటమిన్ సి పుష్కలం
వంటల్లో వాడుకున్న
ఎంతగానో ఉపయోగం
పోపుదినుసు వైద్యము
వంటింట్లో లభ్యం

జిలకరలో గుండెమంట 
తగ్గించే సుగుణాలు 
అహారంతొ తీసుకున్న
తప్పకుండా ఫలితాలు
పోపుదినుసు వైద్యము
వంటింట్లో లభ్యం

యాంటి ఆక్సిడెంట్లు
యాలకుల్లో ఉన్నవి
ఆయుర్వేద శాస్త్రం
మేలు చేయునన్నవి
సుగుణాల యాలకులు
వాడిచూస్తే ఫలితాలు

యాంటి ఆక్సిడెంట్స్ 
ఫ్రీ రాడికల్సుల పసుపు
జలుబుదగ్గు నివారించు
వాడితున్న తెలుసు
పోపుదినుసు వైద్యము
వంటింట్లో లభ్యం

సుగుణాలెన్నో ఉన్న
మిరియాల కషాయం
తీసుకుని పొందవచ్చు
సి విటామిను అధికం
పోపుదినుసు వైద్యము
వంటింట్లో లభ్యం