సంధ్యా సమయం (బాల గేయం)పెందోట వెంకటేశ్వర్లు , సిద్దిపేట
తూర్పు కొండలు ఎక్కేస్తూ 
మెల్లమెల్లగా వస్తున్నాడు 
వేడి వెలుతురు తెస్తాడు
అందరి మిత్రుడు అవుతాడు 

సంధ్య సమయం మధురం
పక్షుల కిలకిల గానం 
పశువుల అరుపుల సంగీతం
రైతుల సాగు బాటు సమరం

ఆటంకాలు ఎన్ని వచ్చినా
తెలివిగా తప్పక పోతాడు 
లక్ష్యం పైనే గురి నిలుపుతూ
పడమర గమ్యం చేరుతాడు