సైతం.:--తాటి కోల పద్మావతి గుంటూరు.

 రేపటి ఉషస్సు కోసం
ఈ రాత్రి చీకటిని ఆహ్వానిస్తాను
వేకువ కిరణాలను తాకి వికసించాలని 
మొగ్గనై ఎదురు చూస్తాను
విరిసిన పువ్వుల పరిమళాలను
పిల్ల గాలి ఎలా మోస పోతాను.
మోడుబారిన తరువుకు కొత్త చిగుళ్ళు తొడిగి
పచ్చదనపు పర్యావరణంలో 
కాలుష్యాన్ని కడిగి వేస్తాను.
నిన్నటి గాయాలకు రేపటి ఆశ 
అనే ఔషధాన్ని అందిస్తాను.
దుఃఖించే కన్నులను చూసి బాధను 
మరపించే నవ్వులు పంచుతాను
   ఆకాశంలో లో మేఘమై చినుకు చినుకు పై రాలి
తడియారని అందాలతో ఆమని నే
 పులకింప చేస్తాను. కొత్త సంకల్ప బలానికి తోడుగా
ఏదో ఏదో అద్భుత శక్తి నా అణువణువు నిండితే
లక్ష్య సాధన కోసం నిరంతరం
 విజయపథం వైపు అడుగులు వేసి
నూతనత్వానికి శాంతి స్వభావంతో
నేను సైతం విజయానికి బాటలు వేస్తాను.