పిల్లిపేరు* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(నాలుగవభాగం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 13)
నీవు ముసలోడివి ఔతున్నవ్
నీవు చెవిటోడివి అయినవ్
నామాట విను ఇపుడు
విన్నాక మాట్లాడు అపుడు!
14)
అదుగదుగో అటుచూడు ఏమున్నదో
వినిపించిందా నీకు ఏమైతున్నదో
చిట్టెలుక మనగోడను గీరిపెట్టె
మట్టిపెళ్ళలను అది పడగొట్టె!
15)
గోడ కన్న బలమైనది
ఎలుక అన్నది నిజమైనది
అందువల్ల మన పిల్లిని
అందామా "ఎలుక" అని!
16)
అని చెప్పిన అవ్వమాట
తాతకు నచ్చలేదు ఎందుకట
తాత మనసులో ఉన్నది
అప్పుడె అన్నాడు నిజమిది!
(సశేషం)

కామెంట్‌లు