"మాతృభాష :-"వై నీరజరెడ్డి .తెలుగు భాష ఉపాధ్యాయురాలు.జడ్పిహెచ్ఎస్ కుకునూర్పల్లి.
అమ్మ పాలతో నేర్చిన భాష.
తొలి పలుకులు పలికిన భాష
.ఆటపాటల ఆనంద భాష.
అమ్మ కథలతో హాయి గొల్పు భాష. 

తీయ తీయని పదముల భాష. 
తేట మీగడ వంటి కమ్మని భాష.
 సోయగాలు కురిపించు భాష. 
పల్లవించు రాగాల భాష. 


రారాజులు పోషించిన భాష. 
మిన్నగా కావ్యాలు ఉన్న భాష .
మధురమైన తెలుగు భాష.

 
మన్నన పొందిన రాజభాష


మ్రోగి0ది.మన తెలుగుభాష .
మోహనరాగాన మధుర భాష. 
పున్నమి చంద్రుని పోలిన భాష. 
సర్వ దేశములు కొనియాడే భాష.