-డా. చిటికెన కిరణ్ కుమార్ కు వరల్డ్ అచీవర్ అవార్డు


 ప్రముఖ రచయిత వ్యాసకర్త  -డా. చిటికెన కిరణ్ కుమార్ కు  వరల్డ్ అచీవర్ అవార్డు ప్రధానం చేశారు. శనివారం ఉదయం తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణం హైదరాబాద్ లో   జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా అవార్డుతో సత్కరించారు   ఈ సందర్భంగా డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ మాట్లాడుతూ తన సాహితీ ప్రస్థానంలో ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషదాయకం అని ఈ ప్రోత్సాహం తో ఇంకా ముందు ముందు మరిన్ని రచనలు,  వ్యాసాలను సమాజానికి అందించే బాధ్యత నాపై పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ డాక్టర్ పైడి అంకయ్య, తో పాటు యం. యాదయ్య ( రిటైర్డ్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ), అంజనీకుమారి పి.వి.పి ( తెలంగాణ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ), ఎం ఆర్ చౌదరి వడ్లపట్ల ( ఫిల్మ్ యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ), అమృత్ కుమార్ జైన్ ( ప్రముఖ సంఘ సేవకులు ) పద్మిని నాగులపల్లి ( ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ) అతిథులుగా పాల్గొన్నారు.

కామెంట్‌లు